logo

నెమలి కృష్ణుడికి పసిడి పంచె వితరణ

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానానికి గంపలగూడెం గ్రామ వాస్తవ్యులు తల్లపురెడ్డి కృష్ణారెడ్డి, శారద దంపతులు మంగళవారం రూ.20,78,400 విలువైన 407.9 గ్రాముల బరువైన పసిడి పంచెను వితరణగా అందించారు.

Published : 05 Oct 2022 01:49 IST

ఆలయ కమిటీ అధ్యక్షురాలు శశిరేఖకు బంగారు పంచె ఆభరణం అందజేసిన కృష్ణారెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు

నెమలి(గంపలగూడెం), న్యూస్‌టుడే: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానానికి గంపలగూడెం గ్రామ వాస్తవ్యులు తల్లపురెడ్డి కృష్ణారెడ్డి, శారద దంపతులు మంగళవారం రూ.20,78,400 విలువైన 407.9 గ్రాముల బరువైన పసిడి పంచెను వితరణగా అందించారు. కృష్ణారెడ్డి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఉదయం నల్లనయ్య మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు తిరునఘరి గోపాలాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కావూరి శశిరేఖ స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు దాతకు అందించి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని