logo

అడ్డుకునేవారేరీ?

గన్నవరం పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు.

Published : 28 Nov 2022 04:04 IST

ముదిరాజ్‌పాలెం సమీపంలో పొక్లెయిన్లతో అక్రమ తవ్వకాలు

గన్నవరం పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. గత మూడేళ్లుగా నియోజకవర్గ పరిధిలోని పోలవరం మట్టిని జగనన్న కాలనీల మెరక, ఇతర అనుమతుల పేరిట విజయవాడ, గుంటూరు నగరాలకు తరలిస్తున్న దళారులు రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. పది రోజులుగా గన్నవరం మండల పరిధిలోని ముదిరాజ్‌పాలెం-సూరంపల్లి మధ్య పోలవరం కట్ట మట్టిని యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. నిత్యం వెయ్యి ట్రిప్పుల మేర మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ తవ్వకాలతో పోలవరం కట్ట భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ డేగల్లా దళారులు తెల్లారేసరికి వాలిపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని పాతపాడు, నున్న, కొండపావులూరు, గోపవరపుగూడెం, గొల్లనపల్లి, తెంపల్లి, మల్లవల్లి, రంగన్నగూడెం పరిసరాల్లో అక్రమ మట్టి తవ్వకాలపై ఇటీవల తెదేపా ఎమ్మెల్సీ అర్జునుడు నేతృత్వంలోని నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్న కలెక్టర్‌ కన్నెత్తి కూడా చూడకపోవడంతోనే దళారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అక్రమ మట్టి తవ్వకాలపై నిఘా పెంచడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి సహజ వనరులను కాపాడాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని