logo

భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రిపై డిసెంబరు 15 నుంచి 19 వరకు చేపట్టనున్న భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లకు దేవస్థానం ఈవో భ్రమరాంబ సోమవారం ప్రారంభించారు.

Published : 29 Nov 2022 05:21 IST

క్యూలైను పనులను ప్రారంభిస్తున్న ఈవో భ్రమరాంబ, పక్కన

స్థానాచార్య శివప్రసాదశర్మ, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై డిసెంబరు 15 నుంచి 19 వరకు చేపట్టనున్న భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లకు దేవస్థానం ఈవో భ్రమరాంబ సోమవారం ప్రారంభించారు. కెనాల్‌ రోడ్డు వినాయకుడి గుడి వద్ద స్థానాచార్య శివప్రసాద శర్మ పర్యవేక్షణలో రుత్వికులు పూజలు నిర్వహించారు. అనంతరం క్యూలైన్‌ పనులకు కొబ్బరికాయ కొట్టి అధికారులు పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, డీఈ వెంకటేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి పాల్గొన్నారు.

దుర్గగుడి రాతి మండప నిర్మాణంపై చర్చ

దుర్గగుడిలో అంతరాలయం చుట్టూ ఉన్న ప్రస్తుతం మండపాన్ని తొలిగించి రాతి మండపాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనను నిపుణుల కమిటీతో దేవస్థానం ఈవో భ్రమరాంబ సోమవారం చర్చించారు. గతంలో ఈవో కోటేశ్వరమ్మ హయాంలో దాత రాతి మండప నిర్మాణానికి ముందుకు రాగా అప్పటి అధికారులు ఆలయ రూపు  దెబ్బతింటుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో జరిగిన విషయాలు, ప్రస్తుతం చేపట్టనున్న పనులకు తలెత్తే ఇబ్బందులపై నిపుణల కమిటీ పరిశీలన చేసింది. కమిటీ సభ్యులు విశ్రాంత ఇఎన్‌సీ కొండలరావు, సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్‌ మాధవ్‌, ప్రొఫెసర్‌ అప్పారావు, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని