logo

5 నుంచి జిల్లా స్థాయి కళాఉత్సవ్‌

ఈ నెల 5, 6 తేదీల్లో జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌ పోటీలు అంగలూరు డైట్‌ కళాశాలలో జరుగుతాయని ప్రిన్సిపల్‌ కె.లక్ష్మీనారాయణ తెలిపారు.

Published : 03 Dec 2022 04:52 IST

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ నెల 5, 6 తేదీల్లో జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌ పోటీలు అంగలూరు డైట్‌ కళాశాలలో జరుగుతాయని ప్రిన్సిపల్‌ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, స్థానిక సంస్థల, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో 9, 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు పోటీల్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. 5న శాస్త్రీయ, జానపద, గాత్ర సంగీత, వాయిద్య సంగీత, ఏకపాత్రాభినయ, ద్విమితీయ, త్రిమితీయ దృశ్య సంబంధిత కళావస్తువుల పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 6న, శాస్త్రీయ, జానపద నృత్య పోటీలు జరుగతాయని తెలిపారు. మండల, డివిజన్‌ నుంచి ప్రధానోపాధ్యాయిని అనుమతి పత్రంతో హాజరు కావాలని తెలిపారు. ఆసక్తి గలవారు 8328 214217, 9392 319791 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని