logo

నకిలీ మిర్చి విత్తనాల విక్రయంపై ఆందోళన

నందిగామలో మిర్చి నకిలీ విత్తనాలు విక్రయించిన రైతునేస్తం దుకాణం వద్ద గురువారం జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు, బాధిత రైతులు ఆందోళన చేశారు.

Published : 09 Dec 2022 06:04 IST

నిరసన తెలుపుతున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామలో మిర్చి నకిలీ విత్తనాలు విక్రయించిన రైతునేస్తం దుకాణం వద్ద గురువారం జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు, బాధిత రైతులు ఆందోళన చేశారు. గంపలగూడెం మండలం జింకలపాలెం గ్రామ రైతులు గ్రీన్‌ ఫీల్డ్‌ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన షీల్డ్‌ గోల్డ్‌ 504 రకం మిర్చి విత్తనాలు కొన్నారు. నాటిన తరువాత ఎదుగుదల, కాపు లేకపోవడంతో నకిలీ విత్తనాలుగా నిర్ధరించుకొని బాధిత రైతులు విత్తనాల దుకాణం నిర్వాహకుడికి సమాచారం ఇచ్చారు. కంపెనీ ప్రతినిధులు వచ్చి పైర్లు పరిశీలించి నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టించుకోకపోవడంతో విత్తనాల దుకాణం వద్ద ధర్నా చేశారు. జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సీతారెడ్డి, చనుమోలు సైదులు తదితరులు రైతులకు బాసటగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని