logo

అస్తవ్యస్త పనులతో అవస్థలు

విజయవాడ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ప్రధాన రహదారి వెంబడి జరుగుతున్న ఎయిర్‌పోర్టు కారిడార్‌ పనులు ప్రమాదకరంగా మారనున్నాయి.

Published : 05 Feb 2023 05:39 IST

నిడమానూరు(రామవరప్పాడు), న్యూస్‌టుడే

గూడవల్లి సమీపంలో రహదారి వెంట మట్టి

విజయవాడ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ప్రధాన రహదారి వెంబడి జరుగుతున్న ఎయిర్‌పోర్టు కారిడార్‌ పనులు ప్రమాదకరంగా మారనున్నాయి. ఇందులో భాగంగా రహదారి పక్కనే నిర్మాణ సామగ్రి, పరికరాలను రోడ్డు పక్కనే ఉంచడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ పనుల కోసం తెచ్చిన ఇసుకను రోడ్డు పక్కనే వేస్తున్నారు.

* నిడమానూరు వద్ద బెస్టు ప్రైస్‌ సమీపంలో పక్కా డ్రెయిన్‌ నిర్మాణ పనుల అనంతరం ఫుట్‌పాత్‌ అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు పూడికతీత పనులు నామమాత్రంగా జరిగాయి. అనంతరం కాలిబాటలపై నిర్మాణాల కోసం టైల్స్‌ను అతికించడానికి విద్యుత్తు పరికరాలను వాడాల్సి ఉంది. దీని కోసం జనరేటర్‌ తీసుకు వచ్చారు. పని చేసిన తరువాత దానిని ఖాళీ ప్రదేశానికి తీసుకుని వెళ్లకుండా అలానే వదిలేయడంతో రాత్రి చీకట్లో దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదని వాహనదారులు వాపోతున్నారు. పనులు అప్పగించిన గుత్తేదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
* గూడవల్లి శివారు జాతీయ రహదారిపై వెళ్లే వాహనచోదకులు రాత్రి వేళ వాహనాలను రహదారి పక్కనే నిలుపుదల చేసి సేద తీర్చుకుంటారు. రహదారి వెంట వదిలివేస్తున్న నిర్మాణ సామగ్రితో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.
* ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు గ్రామాల్లో జరుగుతున్న పూడికతీత పనుల కారణంగా వాహనదారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.

ఎనికేపాడు వద్ద రోడ్డు పక్కనే జనరేటర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని