logo

‘గోగుల రమేష్‌కు.. తెదేపా అండ’

తెదేపాలో చేరాలనుకుంటున్న కృష్ణలంకకు చెందిన గోగుల రమేష్‌పై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీపీ కాంతిరాణాటాటాకు వివరించారు.

Published : 09 Feb 2023 01:19 IST

పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో గద్దె రామమోహన్‌, బుద్దా వెంకన్న, సుఖవాసి శ్రీనివాస్‌, గోగుల రమేష్‌

విజయవాడ నేరవార్తలు: తెదేపాలో చేరాలనుకుంటున్న కృష్ణలంకకు చెందిన గోగుల రమేష్‌పై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీపీ కాంతిరాణాటాటాకు వివరించారు. బుధవారం వారు గోగుల రమేష్‌ను తీసుకుని పోలీస్‌ కమిషనర్‌ను కలిశారు. వైకాపా నాయకుడు, కార్పొరేటర్‌ వెంకట సత్యనారాయణపై ఫిర్యాదు చేశారు. అనంతరం గద్దె మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వ్యవహారశైలి నచ్చక, చంద్రబాబునాయుడి సమక్షంలో రమేష్‌ తెదేపాలో చేరాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఆయన్ని మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. బుద్దా మాట్లాడుతూ.. రమేష్‌ గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, వెయ్యి ఓట్లు పొందారని గుర్తు చేశారు. ఆయన తెదేపాలో చేరితే.. వైకాపాకు నష్టం వస్తుందన్న ఆలోచనతో ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. రమేష్‌కు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై పోలీస్‌ కమిషనర్‌ సానుకూలంగా స్పందించి, వాస్తవాలు పరిశీలిస్తానని హామీ ఇచ్చారని గద్దె తెలిపారు. సీపీని కలిసిన వారిలో తెదేపా రాష్ట్ర పరిశీలకులు సుఖవాసి శ్రీనివాస్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని