logo

రక్తహీనత నివారణకు తాటి బెల్లం

కౌమార దశలోని బాలికల్లో (పాఠశాల విద్యార్థినుల్లో) రక్తహీనత నివారణకు ఐరన్‌ మాత్రలతో పాటు, తాటి బెల్లం ఇచ్చే ప్రక్రియను జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 27 Mar 2023 04:47 IST

కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కౌమార దశలోని బాలికల్లో (పాఠశాల విద్యార్థినుల్లో) రక్తహీనత నివారణకు ఐరన్‌ మాత్రలతో పాటు, తాటి బెల్లం ఇచ్చే ప్రక్రియను జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కార్యాలయం నుంచి విద్య, వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కౌమార బాలికల్లో రక్తహీనత నివారణకు ‘ఎనీమియా ముక్తి భారత్‌’ పథకం కింద ఐరన్‌ ఫోలిక్‌ ట్యాబ్‌లెట్లను పాఠశాలలు, కళాశాలల్లో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రక్తహీనత నివారణకు తాటి బెల్లం అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో ఎంత మంది విద్యార్థినులు రక్త హీనతతో బాధ పడుతున్నారో వివరాలను నమోదు చేయాలని చెప్పారు. నివారణకు తీసుకుంటున్న చర్యలు ఎలా అమలవుతున్నాయో తనిఖీలు చేయాలని ఆదేశించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి బి.వి.విజయభారతి స్పందిస్తూ.. జగ్గయ్యపేటలోని బాలికల వసతి గృహంలో ఆదివారం నుంచే తాటి బెల్లాన్ని పంపిణీ చేయనున్నట్టు తెలపగా, కలెక్టర్‌ అభినందించారు. కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, డీఈవో సి.వి.రేణుక, సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు అధికారి మహేశ్వర్‌, ఐసీడీఎస్‌ పీడీ జి.ఉమాదేవి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని