ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు పలువురికి గాయాలు
పెడన-విస్సన్నపేట జాతీయ రహదారిపై పెరికీడు వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
ప్రమాద దృశ్యం
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : పెడన-విస్సన్నపేట జాతీయ రహదారిపై పెరికీడు వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. హనుమాన్‌జంక్షన్ పోలీసుల వివరాల ప్రకారం.. మల్లవల్లి గ్రామానికి చెందిన పంతం జËయరాజు, భార్య జోజమ్మతో కలిసి గుడివాడ వైపు నుంచి ఆటోలో హనుమాన్‌జంక్షన్ వస్తున్నారు. వీరిని జంక్షన్ నుంచి గుడివాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు పెరికీడులో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో తిరగబడి జయరాజు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. జయరాజుని జంక్షన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోక్సో కేసు నమోదు
పెడన న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మడక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వేముల మణికంఠ(24)పై శనివారం పోక్సో కేసు నమోదైంది. ఎస్సై రవిచంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 31న నిందితుడు తన సమీప బంధువైన బాలికను తన ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇతర ప్రాంతానికి పనిపై వెళ్లిన బాధితురాలి తండ్రి తిరిగి వచ్చాక విషయం తెలుసుకుని శనివారం పెడన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
Ghulam Nabi Azad: తదుపరి ‘ఎల్జీ’ అంటూ ప్రచారం.. గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే!
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?
-
Congress: అజయ్ మాకెన్‌కు కీలక పదవి!