సాహసానికి సలాం
భగభగ మండే ఎండలు... 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. అడుగు బయట పెట్టాలంటే హడలి పోవాల్సిన పరిస్థితి.. కాసింత ఊపిరి పీలుద్దామన్నా సెగలు పొగలు. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవమే.
బిడ్డతో కలిసి లారీని అడ్డగించిన వీఆర్వో
భగభగ మండే ఎండలు... 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. అడుగు బయట పెట్టాలంటే హడలి పోవాల్సిన పరిస్థితి.. కాసింత ఊపిరి పీలుద్దామన్నా సెగలు పొగలు. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవమే.
* కానీ.. మట్టి అక్రమ దందాపై సమాచారం రాగా.. విధినిర్వహణలో ఉన్న ఆ అధికారిణికి ఇవేవీ ఆటంకం కాలేదు.
* తన పని తాను చేయడం ఉద్యోగిని కర్తవ్యమే కదా.. ఇందులో కొత్తేం ఉందని అనుకుంటున్నారా?..
* ఆమె 10 నెలల బిడ్డకు తల్లి.. ఇంటి వద్ద చిన్నారి ఆలనా పాలనా చూసే వారు లేక.. నిత్యం తనతోపాటే చంటిబిడ్డను తీసుకుని విధులకు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మట్టి అక్రమ రవాణా వాహనాలు తరలుతున్న సమాచారం రాగా.. చంటి బిడ్డతోపాటే క్షేత్రానికి ద్విచక్రవాహనంపై మెరుపు వేగంతో వచ్చారు. మట్టిని అన్‌లోడ్ చేస్తుండగా వాహనాలను నిలిపివేశారు. రెండు టిప్పర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దాదాపు రెండు గంటలపాటు మండుటెండలోనే చంటిబిడ్డతో కలిసి విధులు నిర్వహించారు.
మాట్లాడుతున్న మీనా
పామర్రు మండలం పసుమర్రు పంచాయతీ పరిధిలో రైతుకు చెందిన దిబ్బను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వి మట్టిని టిప్పర్లలో కొత్తపెదమద్దాలి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వీఆర్వో మీనా తన బిడ్డను సైతం వెంట తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లారు. మట్టి తరలింపు, వాహన వివరాలు, ఇతర అంశాలు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఒక్కొక్క టిప్పర్‌కు రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ సాహసం చేసిన వీఆర్వోను పలువురు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
-
Chandrababu Arrest: ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్‌రెడ్డి