గడువుకు ముందే పోర్టు నిర్మాణం : ఎమ్మెల్యే పేర్ని
పోర్టు నిర్మాణంలో భాగంగా నార్త్ బ్రేక్‌వాటర్ పనులకు శంకుస్థాపన చేసినట్లు మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని వెంక్రటామయ్య(నాని) తెలిపారు.
శంకుస్థాపనలో నాని, నాయకులు
తపశిపూడి(మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: పోర్టు నిర్మాణంలో భాగంగా నార్త్ బ్రేక్‌వాటర్ పనులకు శంకుస్థాపన చేసినట్లు మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని వెంక్రటామయ్య(నాని) తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సౌత్ బ్రేక్‌వాటర్ పనులకు గత నెల 22వ తేదీన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయగా నేడు నార్త్ బ్రేక్‌వాటర్ పనులు ప్రారంభించామని, గోడ నాలుగు మీటర్ల ఎత్తులో, 12 అడుగుల వెడల్పున నిర్మిస్తారన్నారు. నాలుగు బెర్తుల నిర్మాణానికి మట్టిపరీక్షలు జరుగుతున్నాయని, మరో 20 నుంచి 25 రోజుల్లో పరీక్షల ఆధారంగా డిజైన్ ఖరారు అవుతుందని చెప్పారు. పోర్టు నిర్మాణానికి 30 నెలలు గడువు పెట్టినా 24 నుంచి 26 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు బందెల కవితా నోబుల్ థామస్, లంకా సూరిబాబు, ముడ ఛైర్‌పర్సన్ బొర్రా దుర్గాభవానీ, వైకాపా నాయకులు సిలార్‌దాదా, అచ్ఛాబా, బూరగడ్డ రమేష్‌నాయుడు, లంకే వెంకటేశ్వరరావు, జోగి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
Vikasraj: అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం: సీఈవో వికాస్ రాజ్
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
-
Tamil Nadu: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్ డోనర్స్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-
Chandramukhi2: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చంద్రముఖి-2’.. రన్‌టైమ్ ఎంతంటే?