logo

10.61 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సీజ్‌

ఎరువులు, పురుగు మందులు, విత్తన విక్రయ దుకాణాలపై శనివారం వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. అనంత నగరంలో జేడీఏ చంద్రనాయక్‌, ఇతర సిబ్బందిలో కలిసి తనిఖీలు చేశారు. సంజీవరాయ ఫర్టిలైజర్‌, బాలాజీ అగ్రి ఇన్‌పుట్‌, లక్ష్మీవెంకటేశ్వ

Published : 22 May 2022 04:33 IST


దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న జేడీఏ చంద్రనాయక్‌, ఏవో ప్రసాద్‌

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: ఎరువులు, పురుగు మందులు, విత్తన విక్రయ దుకాణాలపై శనివారం వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. అనంత నగరంలో జేడీఏ చంద్రనాయక్‌, ఇతర సిబ్బందిలో కలిసి తనిఖీలు చేశారు. సంజీవరాయ ఫర్టిలైజర్‌, బాలాజీ అగ్రి ఇన్‌పుట్‌, లక్ష్మీవెంకటేశ్వర ఫర్టిలైజర్‌, పాలెం ఆగ్రో సెంటర్‌, ధరణి ఫెస్టిసైడ్స్‌ అండ్‌ సీడ్స్‌ దుకాణాల్లో తనిఖీ చేశారు. రూ.9,45,577 విలువైన 10.61 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, విత్తనాలను సీజ్‌ చేసినట్లు జేడీఏ తెలిపారు. ఆయా దుకాణాదారులపై 6-ఎ కేసులు నమోదు చేశామన్నారు. దుకాణాదారులు నిబంధనలు పాటించడం లేదని చెప్పారు. ఏ కంపెనీతో ఏయే ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కొనుగోలు చేశారన్న సోర్స్‌ సర్టిఫికెట్టు లేకపోవడం, కాలం చెల్లినవి తనిఖీల్లో గుర్తించామని పేర్కొన్నారు. ఖరీఫ్‌సీజన్‌లో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అనుమతి లేకుండా విక్రయించవద్దని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకట్రాముడు, వ్యవసాయాధికారుల వెంకటేశ్వరప్రసాద్‌, సోమశేఖర్‌, బాలూనాయక్‌, ఆదిలక్ష్మి, అర్చన పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని