logo

చెరువా.. మురుగునీటి ప్లాంటా?

అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల పర్యవేక్షణ లోపం కారణంగా పైపులైన్‌ పునరుద్ధరించకపోవడంతో.. బుక్కపట్నం చెరువు భూగర్భ మురుగునీటి ప్లాంటుగా మారిపోయింది. ఎనిమిది నెలలుగా పుట్టపర్తికి చెందిన భూగర్భ మురుగునీరు చెరువులోకి వెళుతున్నా... కళ్లు

Updated : 27 Jun 2022 06:36 IST


ఇలా ఉంటే పైపులైన్‌ మరమ్మతులు సాధ్యమయ్యేనా?

పుట్టపర్తి, న్యూస్‌టుడే: అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల పర్యవేక్షణ లోపం కారణంగా పైపులైన్‌ పునరుద్ధరించకపోవడంతో.. బుక్కపట్నం చెరువు భూగర్భ మురుగునీటి ప్లాంటుగా మారిపోయింది. ఎనిమిది నెలలుగా పుట్టపర్తికి చెందిన భూగర్భ మురుగునీరు చెరువులోకి వెళుతున్నా... కళ్లు అప్పగించి చూస్తున్నారే తప్ప పైపులైన్‌ పనులు చేపట్టిన పాపనపోలేదు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గత ఏడాది నవంబర్‌ 19న చిత్రావతి నది ఉద్ధృతితో నదిలో అటువైపు వెళుతున్న పైపులైన్‌ కొట్టుకుపోయింది. అప్పటి నుంచి అధికారులు, పాలకులు వెళ్లి చూడడం తప్ప సమస్యను పరిష్కరించలేదు. దీంతో రోజూ 18 నుంచి 21 లక్షల మురుగునీరు యథేచ్ఛగా చిత్రావతినది ద్వారా చెరువులోకి చేరి తాగునీరు కలుషితమవుతోంది. మరమ్మతులు చేపడుతున్నాం, టెండర్లు పిలిచాం అని అధికారులు చెబుతుండగానే.. చిత్రావతినది ఎగువ ప్రాంతంలో అధికంగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం నది ప్రవహిస్తోంది. పనులు చేపట్టడానికి సాధ్యమయ్యే అవకాశాలు కన్పించడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని, పైపులైన్‌ పునరుద్ధరించకపోతే మూడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. పైపులైన్‌ పునరుద్ధరణకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఏఈ మురళీధర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని