logo

జెండావిష్కరణలోనూ అసమ్మతి రాజకీయాలు

స్వాతంత్య్ర సమరంలో మండలంలోని చౌళూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రామానికి చెందిన ఇద్దరు బ్రిటీష్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించారు. వారి స్మారకార్థం గ్రామస్థులు 1947 ఆగస్టు 15న గ్రామంలో చిహ్నాన్ని నిర్మించారు. ఇక్కడ వేడుకలు జరపడానికి గ్రామస్థులు కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌

Published : 15 Aug 2022 05:22 IST

చౌళూరులో ఉద్రిక్తత  

జెండా స్తూపం వద్ద వాదులాడుకొంటున్న అధికారులు, గ్రామస్థులు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరంలో మండలంలోని చౌళూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రామానికి చెందిన ఇద్దరు బ్రిటీష్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించారు. వారి స్మారకార్థం గ్రామస్థులు 1947 ఆగస్టు 15న గ్రామంలో చిహ్నాన్ని నిర్మించారు. ఇక్కడ వేడుకలు జరపడానికి గ్రామస్థులు కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఇక్కడ అధికారికంగా నిర్వహిస్తారని, ఆ సమయంలో మాత్రమే వేడుకలు జరగాలని ఆదివారం అధికార యంత్రాంగం స్థానికులకు హుకుం జారీ చేసింది. రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్‌ ఉన్నతాధికారులు గ్రామానికి వెళ్లి ఆదేశాలు జారీ చేయడం వివాదంగా మారింది. కేసులు పెట్టినా సరే... సోమవారం ఉదయం తాము జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు జరుపుతామని స్థానిక నాయకులు అధికారులకు తేల్చి చెప్పారు. ఇలా రెండు వర్గాలు పట్టుబట్టడం వెనుక రాజకీయాలే కారణమమని తెలుస్తోంది. గ్రామంలో వేడుకల నిర్వహణ వెనుక అధికార పార్టీలో అసమ్మతి నాయకుల్లో ముఖ్యుడైన పార్టీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి, గ్రామీణ మండల ఎంపీపీ, గ్రామ సర్పంచి తదితరులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామంలోని ఇక్బాల్‌ వర్గీయులు ఈ సమాచారాన్ని ఆయనకు చేరవేయడం, ఆయన వద్ద కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అధికారులను, పోలీసులను రంగంలోకి దించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని