logo

అయినవారు దూరమయ్యారని..

కట్టుకొన్న భర్త.. ఇద్దరు కుమారులు దూరమయ్యారు. ఒంటరిగా ఉన్న ఆమె జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కళ్యాణదుర్గం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు..

Published : 03 Oct 2022 05:14 IST

వివాహిత ఆత్మహత్య

దాసంపల్లి(కళ్యాణదుర్గం గ్రామీణం): కట్టుకొన్న భర్త.. ఇద్దరు కుమారులు దూరమయ్యారు. ఒంటరిగా ఉన్న ఆమె జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కళ్యాణదుర్గం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. మండలంలోని దాసంపల్లికి చెందిన సోమనాథ్‌, విజయలక్ష్మి(57) దంపతులకు ఇద్దరు కుమారులు. సోమనాథ్‌ అనంతపురంలో ఏఆర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ నాలుగేళ్ల కిందట గుండెపోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి విజయలక్ష్మి హైదరాబాద్‌లోని పెద్దకుమారుడు సురేష్‌ వద్ద ఉండేది. రెండేళ్ల క్రితం సురేష్‌ రోడ్డు ప్రమాదంలో, అదే ఏడాది చిన్నకుమారుడు మనోజ్‌ గుండెపోటుతో మృతి చెందారు. భర్త, కుమారులు దూరమవడంతో ఆమె మనోవేదనకు గురైంది. ఈ ఏడాది ఆగస్టులో కాశీకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా అక్కడి పోలీసులు రక్షించారు. వివరాలు ఆరా తీసి అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించారు. పోలీసులు ఆమెను తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చి దాసంపల్లిలోని ఆమె మరిది ఇంటికి పంపారు. శనివారం రాత్రి బయటికెళ్లి విషద్రావకం తాగింది. కొంతసేపటికి గట్టిగా కేకలు వేయడంతో కుటుంబీకులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించేలోపే మృతి చెందింది. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.


ఉరివేసుకొని మహిళ..

గోరంట్ల: గోరంట్లలోని ఎండాలబండ వీధి ప్రాంతంలో నివాసం ఉంటున్న రత్నమ్మ (40) ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త వెంకటాచారి నేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె. కుమారునికి వివాహమైంది. అందరూ కలసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఎస్సై ఇక్బాల్‌ కేసు విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని