logo

నాగబాబు వస్తున్నారని.. రహదారికి మరమ్మతులు

జనసేన నాయకుడు నాగబాబు వస్తున్నారని.. అనంతపురంలో హడావిడిగా రోడ్డు పనులు ప్రారంభించారు. ఆదివారం ఆయన అనంతపురంలో పర్యటించనున్నారు.

Published : 22 Jan 2023 05:49 IST

రోడ్డు తవ్వి కంకర వేశారిలా..

అనంత నగరపాలక, హౌసింగ్‌బోర్డు, న్యూస్‌టుడే: జనసేన నాయకుడు నాగబాబు వస్తున్నారని.. అనంతపురంలో హడావిడిగా రోడ్డు పనులు ప్రారంభించారు. ఆదివారం ఆయన అనంతపురంలో పర్యటించనున్నారు. అధ్వానంగా మారిన కలెక్టరేట్‌ నుంచి చెరువు కట్ట మీదుగా బుక్కరాయసముద్రం వెళ్లే దారిని నాగబాబు ఆధ్వర్యంలో జనసేన నాయకులు శ్రమదానంతో గుంతలు పూడ్చాలని నిర్ణయించారు. విషయం తెలుసుకొని శనివారం అధికారులు హడావిడిగా 50 మీటర్ల మేరకు రోడ్డు పనులు ప్రారంభించారు. పొక్లెయిన్‌తో ఓ వైపు రోడ్డును కొంత భాగం తవ్వి, మిక్సర్‌ కంకర వేశారు. నాగబాబు శ్రమదానం చేస్తారని తెలియడంతో రెండున్నరేళ్లుగా కనీసం గుంతలు పూడ్చని అధికారులు శనివారం పనులు ప్రారంభించారని జనసేన కార్యనిర్వహణ కార్యదర్శి భవాని రవికుమార్‌, ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీ మరో ప్రజావిజయం సాధించిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని