సరస్వతీ నిలయం.. కస్తూర్బా విద్యాలయం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా, మిగులు సీట్ల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ప్రవేశాలకు అవకాశం
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
జగరాజుపల్లి కస్తూర్బా విద్యాలయం
పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా, మిగులు సీట్ల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన, బడిమానేసి చదువుకు దూరమైన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్, వలస కుటుంబాలకు చెెందిన బాలికలు మాత్రమే దరఖాస్తునకు అర్హులు. విద్యార్థి పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్, కుల, ఆదాయ, రేషన్‌కార్డు నకలు, పాస్ ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సందేహాలకు ఆయా కేజీబీవీల్లోని ప్రిన్సిపాళ్లను సంప్రదించాల్సి ఉంటుంది..
ఖాళీలు ఇలా..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 62 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి 40 సీట్లు ఉంటాయి. ఈ లెక్కన మొత్తం 2,480 సీట్లు భర్తీ చేయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి సంబంధించి ఒక్కో కేజీబీవీలో 40 సీట్లు మేర 62 కేజీబీవీల్లో 2,480 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటితోపాటు 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తారు.
ప్రత్యేకతలు: బోధకులంతా మహిళలే. ప్రతి సబ్జెక్టుకు బోధకులు ప్రత్యేకంగా ఉంటారు. క్రీడలు, యోగా, సాంస్కృతిక, స్వయం ఉపాధి తదితర వాటిల్లో శిక్షణ ఇస్తారు. అవసరమైన సామగ్రి, దుస్తులు, దుప్పట్లు అన్ని ఉచితమే. పోషకాలతో కూడిన ఆహారం, వారంలో ఐదు రోజులు గుడ్డు, అల్పాహారం, ప్రతి ఆదివారం మధ్యాహ్నం కోడికూరతో భోజనం వడ్డిస్తారు.
వెబ్ సైట్ : apkgbv.apcfss.in లో దరఖాస్తు చేసుకోవాలి.
సద్వినియోగం చేసుకోండి
ఆసక్తి ఉన్న వారు సమీపంలోని కేజీబీవీ పాఠశాల ప్రధానాచార్యులను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే తప్పులకు అవకాశం ఉండదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంకంటే నేరుగా కస్తూర్భా విద్యాలయాలకు వెళ్లడం మంచిది.
మీనాక్షి, డీఈఓ, శ్రీసత్యసాయి జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్‌లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్‌ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..