logo

తాగునీటి సమస్య పరిష్కరించకుండా విమర్శలా?

నగర ప్రజలంతా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా వైకాపా నాయకులు తెదేపాపై అనవసర విమర్శలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్‌మోహిద్దీన్‌ మండిపడ్డారు.

Published : 28 Mar 2024 04:51 IST

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు): నగర ప్రజలంతా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా వైకాపా నాయకులు తెదేపాపై అనవసర విమర్శలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్‌మోహిద్దీన్‌ మండిపడ్డారు. బుధవారం స్థానిక కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అనంత నగరం 50 డివిజన్ల కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అంతా అధికార పార్టీలో ఉంటూ నగర సమస్యలు గాలికి వదిలేసి ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైకాపా గల్లీ నాయకులకు సమాధానం చెప్పేస్థాయికి తాము దిగజారలేదన్నారు. తెదేపా హయాంలో జిల్లా గ్రంథాలయ సంస్థను రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంచామన్నారు. ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని