logo

ధర్మవరం భాజపాకే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్‌

Published : 28 Mar 2024 05:05 IST

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: తెదేపా-జనసేన-భాజపా కూటమి ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థిగా సత్యకుమార్‌ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ బుధవారం  ప్రకటించింది. పొత్తులో భాగంగా ధర్మవరం స్థానాన్ని భాజపాకు కేటాయించారు. తొలుత భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ధర్మవరం తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్‌.. తనకే టికెట్‌ కేటాయించాలని పార్టీ అదిష్టానాన్ని కోరారు. అనూహ్యంగా సత్యకుమార్‌కు టికెట్‌ దక్కింది.  

సత్యకుమార్‌ వ్యక్తిగతం

  • పుట్టిన తేదీ: 16-09-1971
  • విద్య: ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌)
  • కులం: బీసీ (యాదవ్‌)

రాజకీయ నేపథ్యం: విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. మదనపల్లిలో చదువుకుంటున్న సమయంలో ఏబీవీపీ తరఫున కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వద్ద కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. సత్యకుమార్‌ సేవలను గుర్తించిన భాజపా 2018లో జాతీయ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జిగా, అండమాన్‌ నికోబార్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని