logo

ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్‌ అగర్వాల్‌ జిల్లాకు చేరుకున్నారు.

Published : 18 Apr 2024 04:19 IST

నితిన్‌ అగర్వాల్‌కు స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌ బర్దర్‌

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్‌ అగర్వాల్‌ జిల్లాకు చేరుకున్నారు. బుధవారం ఆయన అనంత నగర పోలీసు అతిథి భవన సముదాయంలో బస చేశారు. ఈయనకు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌ బర్దర్‌ పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్‌ అగర్వాల్‌ రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల్లోని అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై నిఘా ఉంచనున్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌, ఎన్నికల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్‌ కార్యాలయం కమాండ్‌ కంట్రోల్‌ రూంలోని వివిధ విభాగాలతో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల నివేదికలు జాప్యం లేకుండా సీఈఓకు పంపాలన్నారు. నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం నివేదికల తయారీ, సిపార్సులో ఎలాంటి ఆలస్యం ఉండటానికి వీలులేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని