logo

కళ్లు మూసుకున్న పాలకులకు కల్వర్టు కష్టాలేం తెలుస్తాయ్‌..

వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన బాగుచేస్తే వందలాది మందికి ప్రయోజనం. అయినా వైకాపా ప్రభుత్వానికి కనీస పట్టింపులేదు.

Published : 30 Apr 2024 04:33 IST

వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన బాగుచేస్తే వందలాది మందికి ప్రయోజనం. అయినా వైకాపా ప్రభుత్వానికి కనీస పట్టింపులేదు. రామగిరి మండల పరిధి లోని పేరూరు డ్యామ్‌కు దిగువన ఉన్న పేరూరు-కంబదూరు ప్రధాన రహదారి కల్వర్టు 2022లో కురిసిన భారీ వర్షాలకు డ్యామ్‌లో నీరు చేరి ప్రవహించడంతో దిగువనున్న కల్వర్టు నీటి ఉద్ధృతికి కొట్టుకుని పోవడంతో 6 నెలలపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్యామ్‌ మీదుగా రాకపోకలు సాగించారు. నీటి ఉద్ధృతి తగ్గిన తరువాత స్థానికులు మట్టి వేసుకొని రాకపోకలు సాగించారు. తాత్కాలిక రహదారి ఏర్పాటుపై అప్పట్లో వైకాపా రాజకీయం చేసింది. అనంతరం అధికారులు తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు. అనంతరం వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ చర్యలు తీసుకోగా స్థానిక వైకాపా నాయకుడు పనులు చేపట్టారు. మూడేళ్లు కావస్తున్నా నేటికీ పనులు పూర్తి చేయలేదు. మళ్లీ వర్షాలు కురిస్తే ప్రయాణికులకు తిప్పలే. 

 - న్యూస్‌టుడే, రామగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని