logo

అమృత్‌ను అటకెక్కించారు

పెనకచర్ల డ్యామ్‌ నుంచి పామిడి మండలానికి నీరు రప్పించడం ద్వారా తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్న ఆలోచనతో అమృత్‌ పథకం కింద తెదేపా హయాంలో చేపట్టిన పనులు అటకెక్కాయి.

Updated : 30 Apr 2024 06:49 IST

ఐదేళ్లుగా పూర్తికాని తాగునీటి పథకం

 

 పామిడి ఎసీˆ్స హాస్టల్‌ ఆవరణలో పిల్లర్ల దశలో ఆగిపోయిన నీటి ట్యాంకు నిర్మాణం

పామిడి, న్యూస్‌టుడే: పెనకచర్ల డ్యామ్‌ నుంచి పామిడి మండలానికి నీరు రప్పించడం ద్వారా తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్న ఆలోచనతో అమృత్‌ పథకం కింద తెదేపా హయాంలో చేపట్టిన పనులు అటకెక్కాయి. వైకాపా అధికారంలోకి రాగానే పనులు ముందుకు సాగలేదు. నిధులు కేటాయిస్తే ట్యాంకుల  పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నా .. అటుగా కనీసం దృష్టిసారించలేదు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.69.30 కోట్లు.ఇందులో భాగంగా పెనకచర్ల డ్యామ్‌ నుంచి సొరకాయలపేట, కొత్తపల్లి, పామిడిలోని ఎసీˆ్స హాస్టల్‌, గుప్తాకాలనీల్లో నాలుగు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు పైపులైన్‌ అనుసంధానం చేస్తూ నిర్మించాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2018లో పనులు ప్రారంభమయ్యాయి. తరువాత వైకాపా అధికారంలోకి రావడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. తెదేపా హయాంలో చేపట్టిన పనులన్నింటికీ నిలిపివేశారు. ఈ నాలుగు ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో మూడింటి పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన ఒక ట్యాంకు పనులు పునాధి దశలో ఆగిపోయాయి. ఈ ట్యాంకులను త్వరగా పూర్తి చేసి తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని