logo

ఆత్మీయ స్పందన

జిల్లా ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 26 ఫిర్యాదులు అందాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో అందించారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డి అన్ని ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు మంచినీరు

Published : 24 May 2022 05:29 IST


చిన్నారికి చాక్లెట్‌ ఇస్తున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి 

చిత్తూరు(నేరవార్తలు): జిల్లా ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 26 ఫిర్యాదులు అందాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో అందించారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డి అన్ని ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు మంచినీరు అందించి వారితో వచ్చిన చిన్నారులకు మిఠాయిలిచ్చి ఆప్యాయంగా పలకరించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కొన్నింటిపై సంబంధిత స్టేషన్‌ అధికారులతో మాట్లాడారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్సై మాధవ పాల్గొన్నారు. 
చిత్తూరు(జిల్లా సచివాలయం): జిల్లా సచివాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 95 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ సమస్యలు 63, డీఆర్‌డీఏ 4, గృహనిర్మాణం 9, సంక్షేమ శాఖలు 5, వైద్యఆరోగ్య శాఖ 3, ఇతర సమస్యలపై 11 అర్జీలు ఉన్నాయి. కలెక్టర్‌ హరినారాయణన్‌ అర్జీలు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. జేసీ వెంకటేశ్వర్, డీఆర్‌వో రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని