logo

తిరుమలలో అభివృద్ధికి భారీగా నిధులు

తిరుమలలో భక్తులకు సౌకర్యాల పెంపుతో పాటు స్థానికుల నివాస ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తితిదే నుంచి భారీగా నిధులు కేటాయించామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Published : 01 Dec 2022 04:12 IST

తితిదే ఛైర్మన్‌  సుబ్బారెడ్డి

సమావేశంలో సమీక్షిస్తున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో భక్తులకు సౌకర్యాల పెంపుతో పాటు స్థానికుల నివాస ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తితిదే నుంచి భారీగా నిధులు కేటాయించామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే ఛైర్మన్‌ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. శ్రీవారి ఆలయానికి అనుబంధంగా చేపట్టే కార్యక్రమాలపై బోర్డుసభ్యులు పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం విలేకరుల సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వివరాలు వెల్లడించారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్ణయాలివీ..

* నందకం అతిథిగృహంలో ఫర్నిచర్‌ ఏర్పాటుకు రూ.2.95 కోట్ల కేటాయింపు.

* రెండో ఘాట్‌లో రక్షణ గోడ నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు.

* తిరుమలలోని బాలాజీనగర్‌లో రోడ్లు, డ్రైనేజీ, పార్కింగ్‌ నిర్మాణాలకు రూ.3.70 కోట్ల కేటాయింపు.

* శ్రీ పద్మావతి అతిథిగృహం ఆధునికీకరణ, ఫర్నిచర్‌ కొనుగోలుకు రూ.3.80 కోట్ల మంజూరు.

* స్విమ్స్‌లో అదనపు అంతస్తు నిర్మాణానికి రూ.3.31 కోట్ల కేటాయింపు.

* తితిదే ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో మందులకు రూ.2.56 కోట్లు, సర్జికల్స్‌ కొనుగోలుకు రూ.36 లక్షలు మంజూరు.

* తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ అభివృద్ధికి రూ.3.75 కోట్లు కేటాయింపు.

* తితిదేలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం అందజేతకు తీర్మానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని