logo

ముసలిమడుగు వద్ద ఏనుగుల గుంపు

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాలోపల్లె వద్ద 20 ఏనుగుల బృందం మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చేసింది.

Published : 07 Dec 2022 01:32 IST

పిల్లలు సహా మకాం

రోడ్డు దాటేందుకు యత్నిస్తున్న ఏనుగులు

పలమనేరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాలోపల్లె వద్ద 20 ఏనుగుల బృందం మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చేసింది. ఇవి రోడ్డు దాటడానికి యత్నించడంతో రైతులు, ప్రయాణికులు కేకలు పెట్టారు. దీంతో వచ్చిన దారినే అవి అడవిలోకి వెళ్లిపోయాయి. వీటితో పాటు ఐదు పిల్లలు కూడా ఉన్నాయి. ఇవి సోమవారం రాత్రి తోటకనుమ నుంచి వెంగంవారిపల్లె, బాపలనత్తం మీదుగా మాదిగబండకు చేరుకున్నాయి. ఉదయం దొడ్డిపల్లె, పి.వడ్డూరు, తెల్లగుండ్లపల్లె మీదుగా ముసలిమడుగు వచ్చాయి. ఒక్కసారిగా ఇలా ఏనుగుల గుంపు పొలాలపైకి రావడంతో రైతులు హడలిపోయారు. వెంకటమ్మ, మునిరాజులు, గోపి అనే రైతులకు చెందిన వరి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. ముసలిమడుగు వద్ద మామిడి తోటను నేలమట్టం చేశాయి. అటవీశాఖ సిబ్బంది వాటిని అడవిలోకి పంపడానికి శతవిధాలా ప్రయత్నించారు. గున్నలు వాటితో ఉన్నందున తరమడం సాధ్యం కాలేదు. ప్రస్తుతం అవి ముసలిమడుగు సమీపంలోని దర్గా వద్ద అడవిలో మకాం వేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని