పువ్వుకో పరిమళం
శ్రీవారితోపాటు తితిదే ఆలయాల్లో ఉపయోగించే పుష్పాల నుంచి తయారు చేసే ఏ వస్తువునైనా పవిత్రంగా భావించి తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు.
రసాయనాలు లేని అగరబత్తీల తయారీ
అగరబత్తీలు తయారు చేస్తున్న మహిళలు
న్యూస్‌టుడే, తిరుపతి(గ్రామీణ): శ్రీవారితోపాటు తితిదే ఆలయాల్లో ఉపయోగించే పుష్పాల నుంచి తయారు చేసే ఏ వస్తువునైనా పవిత్రంగా భావించి తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. తిరుమలతోపాటు స్థానిక ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు వినియోగించే పూలను సద్వినియోగం చేస్తూ తితిదే అగరబత్తీలు తయారు చేస్తోంది. ఇందుకోసం ఒక్కో పుష్పం నుంచి ఒక్కో రకమైన అగరబత్తీలు ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా ఆయా పుష్పాల పరిమళాలను భక్తులు ఆస్వాదించేలా తిరుపతిలోని తితిదే ఎస్వీ గో సంరక్షణ శాలలో వీటిని తయారు చేస్తుండగా.. భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది.
రంగు మారకుండా..
ముందుగా పుష్పాలన్నీ విడి విడిగా వేరుచేసి వాటిని ఒక డ్రై మెషీన్‌లో వేసి వేడి గాలి ద్వారా వాటి రంగు మారకుండా పూలు ఎండిపోయేలా చేస్తున్నారు. వీటిని మిక్సర్‌లో వేసి పొడి చేస్తారు. కన్వేయర్స్‌లో పొడి వేయడంతోనే కింద ఉన్న అగరు పుల్లలపైన పొడి పడేలా చేస్తున్నారు. దాన్ని రెండు రకాలుగా చేసి సెంట్, ఫ్లోరాకి సంబంధించిన యంత్రాలలో వేసి బత్తీ మాదిరి చేస్తారు. ఫ్లోరా బత్తీలకు ఎలాంటి శ్రమ అవసరం ఉండదు. వాటిని ఫ్లవర్ కోటింగ్ యంత్రంలో వేసి నేరుగా చేస్తారు. మరోవైపు సెంట్ బత్తీల పద్ధతి వేరుగా ఉంటుంది. ఈ విధానంలో బత్తీలను ఆరబెట్టి, ద్రవ యంత్రం ద్వారా మూడు రకాల పరిమళాలను జత చేస్తారు. ఆ తర్వాత మరో యంత్రంతో వీటిని ప్యాకింగ్ చేస్తారు. ఇక్కడ మహిళలు బృందాలుగా విడిపోయి పనిచేస్తుంటారు. పూలని విడగొట్టడం నుంచి వాటి ప్యాకింగ్ వరకు అంతా వీళ్లే చూసుకుంటారు. ఇందుకు కావాల్సిన వెదురు కర్రలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ఆలయాల నుంచి సేకరించిన పూలమాలలు
కేంద్రాల్లో విక్రయం
అగరబత్తీల్లో ఫ్లోరా నాలుగు రకాలు, సెంట్ మూడు రకాలు. వీటిలో దివ్య దృష్టి, దివ్య సృష్టి, ఆకృష్టి, దివ్య తుష్టి అనే నాలుగు రకాల ఫ్లోరా బత్తీలు ఉన్నాయి. దాంతో పాటు తందనాన, దివ్యపాద, అభయహస్త అనే పరిమళాలతో సెంట్ బత్తీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కో యంత్రం ద్వారా 100 కిలోల పొడి నుంచి 504 ఫ్లోరా, 940 సెంట్ బత్తీలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని రోజువారీగా తితిదేకి పంపిస్తారు. తితిదే నిర్దేశించిన కేంద్రాల్లో వీటి విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రతి వస్తువుకు ఒక పరమార్థం
వ్యర్థం నుంచి సంపద అనే పద్ధతిలో స్వామి, అమ్మవార్లకు ఉపయోగించిన పూలమాలలతో తితిదే అగరబత్తీలు తయారు చేయిస్తోంది. దీని ద్వారా ఎంతో మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ కంపెనీ సహకారంతో తితిదే కేంద్రం ఏర్పాటు చేసింది.
డాక్టర్ కె.హరినాథ్‌రెడ్డి, ఎస్వీ గోసంరక్షణశాలసంచాలకులు
ఏడు కొండలు.. ఏడు రకాలు
స్వామి, అమ్మవార్లకు వాడే పూలమాలలన్నీ సేకరించి వాటిని విడగొట్టి ఏడు రకాల అగరబత్తీలు తయారు చేస్తున్నారు. రోజా పూల నుంచి తుష్టి, కలువ నుంచి దృష్టి, చామంతి నుంచి సృష్టి రకాలు చేస్తుండగా.. మూడింటినీ కలిపి ఆకృష్టి బత్తీలు తయారవుతున్నాయి. వీటిలో ఫ్లోరా నాలుగు, సెంట్ అగరబత్తీలు మూడు రకాలు ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకి దాదాపు 15వేల బాక్సులు తయారు చేస్తున్నారు. ఫ్లోరా, సెంట్ అగరబత్తీల తయారీ విధానం వేర్వేరుగా ఉంటుంది.
మహిళలకు ఉపాధి
కేంద్రంలో 74 మంది మహిళలు, 14 మంది పురుషులు పని చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి పొందుతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Politics News
Nellore: వైకాపాలో మరో అసంతృప్త గళం.. పరిశీలకుడిపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్
-
Sports News
ICC Rankings: కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్యకుమార్
-
India News
UPSC Jobs: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులెన్నంటే?