logo

త్వరలో గూడూరు, తిరుచానూరులో రైతుబజార్లు

మార్కెటింగ్‌ శాఖ అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. రైతులు, వినియోగదారులకు అసౌకర్యాలు కలగకుండా చేయడమే లక్ష్యం.

Published : 22 Mar 2023 04:34 IST

‘న్యూస్‌టుడే’తో మార్కెటింగ్‌శాఖ ఏడీ సురేంద్రబాబు

తిరుపతి (తాతయ్యగుంట): మార్కెటింగ్‌ శాఖ అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. రైతులు, వినియోగదారులకు అసౌకర్యాలు కలగకుండా చేయడమే లక్ష్యం. నూతన జిల్లాలో మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఏడీ టి.సురేంద్రబాబు ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో తెలిపారు.

* జిల్లాలో మూడు రైతు బజార్లు ఉన్నాయి. ఇందులో తిరుపతి ఆర్‌సీ రోడ్డులోని రైతుబజారు అందుబాటులో ఉంది. ఇక్కడ 94 దుకాణాలు ఉన్నాయి. 8 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. త్వరలో గూడూరు, తిరుచానూరులో ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా తిరుచానూరు, చంద్రగిరి, పాకాల, పుత్తూరు, శ్రీకాళహస్తి, బీఎన్‌ కండ్రిగ, నాగలాపురం, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, వాకాడులో మొత్తం 12 మార్కెటింగ్‌ కమిటీలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా 28 చెక్‌పోస్టులు నిర్వహిస్తున్నారు. 5 కమిటీలకు ఛైర్మన్లు లేకపోవడంతో అధికారులు ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. పాకాల, నాగలాపురం రెండింటికి త్వరలో నియామకం జరగనుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.17.86 లక్షల ఆదాయం అంచనా వేయగా.. రూ.18.25 లక్షలు (మార్చి 20వ తేదీ) వచ్చింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి ఖాళీ పోస్టులు

మార్కెటింగ్‌ శాఖలో 132 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు ఉపయోగకరంగా ఆర్‌బీకేలకు ధరల పట్టికను అందిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించే ధరలను మార్కెటింగ్‌ శాఖ ఆర్‌బీకేలకు ఇస్తుంది. జిల్లాలో మొత్తం 37 మార్కెట్‌ కమిటీ గోదాములు ఉన్నాయి. 26 వినియోగంలో ఉన్నాయి. రైతులు వీటిని వినియోగించుకోవచ్చు. రైతులకు, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని