logo

పాళ్యం అడవిలో చిరుత సంచారం

పాళ్యం అడవిలో చిరుత సంచారంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Published : 24 Mar 2023 01:25 IST

పెనుమూరు, న్యూస్‌టుడే: పాళ్యం అడవిలో చిరుత సంచారంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఉదయం పెనుమూరు-నేండ్రగుంట మార్గంలో రాజా ఇండ్లు సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా అప్పుడే ఆ మార్గంలో వచ్చిన బంగారం అనే ఆటో డ్రైవర్‌ చూశాడని స్థానికులు తెలిపారు. చిరుతను చూసి అతను ఆటోను వెనక్కి మళ్లిస్తుండగా అప్పుడే వచ్చిన కారు సైతం వెనక్కి మళ్లిందని చెప్పారు. అటవీశాఖ సెక్షన్‌ అధికారి భారతి ఆధ్వర్యంలో బీట్‌ ఆఫీసర్లు గీత, సయ్యద్‌బాషా స్థానికుల సాయంతో పరిసర ప్రాంతాల్లోని కుంటలు, చెరువుల వద్ద గాలించారు. ఎక్కడా చిరుత ఆనవాళ్లు దొరకలేదని బీట్‌ ఆఫీసర్‌ గీత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని