logo

ఆయనుంటే.. ఈయనుండరు

ఈ చిత్రాల్లో కన్పిస్తున్నది కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ తరఫున ఏజీఎం నరేంద్ర గుప్త, బ్రాంచి మేనేజర్‌ వీరాంజనేయులు రూ.10 లక్షలతో అత్యాధునిక వసతులు కల్గిన అంబులెన్స్‌ను ముక్కంటి ఆలయానికి వితరణ ఇస్తున్నవి.

Published : 01 Apr 2023 03:13 IST

ముక్కంటి ఆలయంలో లుకలుకలు

ఉదయం ఆలయ ఛైర్మన్‌కు అంబులెన్స్‌ అప్పగిస్తున్న కరూర్‌ వైశ్యాబ్యాంక్‌  ప్రతినిధులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఈ చిత్రాల్లో కన్పిస్తున్నది కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ తరఫున ఏజీఎం నరేంద్ర గుప్త, బ్రాంచి మేనేజర్‌ వీరాంజనేయులు రూ.10 లక్షలతో అత్యాధునిక వసతులు కల్గిన అంబులెన్స్‌ను ముక్కంటి ఆలయానికి వితరణ ఇస్తున్నవి. అయితే ఈ రెండు చిత్రాల్లో ఉన్న విచిత్రం ఏమంటే.. బ్యాంకు నిర్వాహకులు అంబులెన్స్‌కు సంబంధించిన తాళాలను ఉదయం ఛైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులుకు అప్పగించారు. మధ్యాహ్నం అదే తాళాలను మళ్లీ ఎమ్మెల్యే బియ్యపు మధసూదన్‌రెడ్డికి అందజేశారు. ఉదయం చిత్రంలో ఎమ్మెల్యే లేకపోవడం, మధ్యాహ్నం చిత్రంలో ఛైర్మన్‌ లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ట్రస్టు బోర్డు కొనసాగింపుపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఘట్టం చోటుచేసుకోవడం వైకాపాలోని లుకలుకలకు మరింత ఆజ్యం పోయడం చర్చనీయాంశమైంది.

మధ్యాహ్నం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి అందజేస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని