logo

వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమానికి వెళ్తూ వాహనం బోల్తా

వైఎస్సార్‌ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ బొలెరో వాహనం బోల్తా పడి 36 మందికి గాయాలైన ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటుచేసుకుంది.

Published : 01 Apr 2023 03:13 IST

36 మంది మహిళలకు గాయాలు

బోల్తా పడిన వాహనం

రామకుప్పం, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ బొలెరో వాహనం బోల్తా పడి 36 మందికి గాయాలైన ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటుచేసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం రామకుప్పం బాలురు ఉన్నత పాఠశాల ఆవరణలో వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు. ఇందుకు డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఉన్సిగానిపల్లి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు 38 మంది బొలెరో వాహనంలో కార్యక్రమానికి బయలుదేరారు. చింతకుప్పం గ్రామ సమీప గంగమ్మ చెరువు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో 36 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ మొదట విజిలాపురం పీహెచ్‌సీకి ఆపై కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మెల్సీ భరత్‌, జేసీ వెంకటేశ్వర్‌ పరామర్శించారు. ముగ్గురికి శస్త్రచికిత్స చేయాలని, మిగిలిన వారంతా రెండు మూడు రోజుల్లో డిశ్ఛార్జి అవ్వచ్చని వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలైన ముగ్గురికి రూ.2 లక్షలు, మిగిలిన వారికి రూ.25 వేలు చొప్పున ఎమ్మెల్సీ, జేసీ ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని