logo

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం చేసుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది.

Published : 16 Jan 2024 08:51 IST

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం చేసుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి ఏటీసీ క్యూలైన్‌ వరకు వేచి ఉన్నారు. సోమవారం 80, 964 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది. 27,657 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయ ఉత్సవం నిర్వహించనున్నారు. పార్వేట మండపం వద్ద ఈ వేడుక జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు