logo

అనిశా వలలో ఆర్‌ఐ

స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు

Published : 28 Mar 2024 03:36 IST

ఆర్‌ఐ రెడ్డెప్ప
కార్వేటినగరం, న్యూస్‌టుడే: స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు. అనిశా డీఎస్పీ జెస్సీ ప్రశాంతి కథనం మేరకు.. స్థానిక ముస్లిం కాలనీకి చెందిన రఫీ తన బంధువుల వ్యవసాయ భూమి పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేశారు. ఇందుకు ఆర్‌ఐ రెడ్డెప్పను సంప్రదించగా నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో అతడు అనిశా అధికారులకు సమాచారం ఇచ్చాడు. పథకం ప్రకారం రఫీతో రూ.12 వేలు నగదు పంపారు. ఆర్‌ఐ రెడ్డెప్ప ఆ నగదును టీ అంగడి వద్దకు తీసుకురావాలని చెప్పడంతో రఫీ అక్కడకు వచ్చి అతడికి ఇస్తుండగా దాన్ని ద్విచక్ర వాహనంలోని కవర్‌లో ఉంచాలని సూచించాడు. దీంతో అతడు వాహనంలోని కవర్‌లో ఉంచడం, ఆర్‌ఐ ఆ నగదు తీసుకోవడానికి రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని