logo

కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా

పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Published : 20 Apr 2024 03:46 IST

త్రిరాష్ట్ర కూడలిలో వేరే జెండా ఎగరడానికి వీళ్లేదు: నారా భువనేశ్వరి

 విరాళాలతో ధరావతు సొమ్ము చెల్లింపు 

పసుపుమయమైన పట్టణం

చంద్రబాబు తరఫున నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న నారా భువనేశ్వరి

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ‘కుప్పం అంటే తెలుగుదేశం.. పార్టీ స్థాపించినప్పటి నుంచి వేరే జెండా ఎగరలేదు.. ఇకపైనా ఎగరకూడదు.. కుప్పం గడ్డ.. ఇది చంద్రబాబు అడ్డా.. మిగిలిన జెండాలు వచ్చేందుకే భయపడాలి.. ఇంకొకరు రావడానికి ధైర్యం చేయకూడదు.. అదే నేను కోరుతున్నా.. వైకాపాను తరిమేసి.. వారి ధైర్యాన్ని తరిమికొట్టండి’ అంటూ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామపత్రం దాఖలు సందర్భంగా వచ్చిన జన సంద్రాన్ని ఉత్తేజపరిచే విధంగా అధినేత్రి నారా భువనేశ్వరి ప్రసంగం సాగింది. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన వేలాది మంది తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆమె మాట్లాడారు. రాష్ట్రం కోసం పోరాడదాం.. వైకాపా రాక్షస పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. వైకాపా నేతల దోపిడీకి అడ్డుపడిన తెదేపా కార్యాకర్తలను దారుణంగా చంపారు, వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాలు, మతాలు వేరైనా.. మనమంతా ఆంధ్రులమని.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. దేశం మెచ్చిన నాయకుడు చంద్రబాబుకి మరింత గౌరవం తీసుకురావాల్సిన బాధ్యత కుప్పం కుటుంబంపై ఉందన్నారు. ఆయనకు లక్ష మెజారిటీ బహుమతిగా ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. సుమారు 40 వేల మంది హాజరు కావడంతో పట్టణమంతా పసుపుమయంగా మారింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, ఇన్‌ఛార్జి మునిరత్నం, పీఏ మనోహర్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, సురేష్‌బాబు, భాజపా ఇన్‌ఛార్జి శివశంకర్‌, జనసేన ఇన్‌ఛార్జి నరేష్‌ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో భద్రత బందోబస్తు ఏర్పాటు చేశారు.

అధినేతకు అండగా..

చంద్రబాబు నాయుడు నామపత్రం దాఖలు కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి దివ్యాంగులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు తరలివచ్చారు. వారంతా విరాళాలను నారా భువనేశ్వరికి అందించారు. ప్రత్యేక ప్రతిభావంతులు కందుకూరుకు చెందిన అశోక్‌, ఏలూరుకు చెందిన జాకోబ్‌, ప్రకాశం జిల్లాకు చెందిన బాలు, బాపట్ల నుంచి అనిల్‌, గుంటూరుకు చెందిన సాయి, నెల్లూరుకు చెందిన గోపీ, చిట్టిబాబు తమవంతుగా ఒక్కొక్కరూ రూ.200 చొప్పున అందించారు.
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి పాదాల వద్ద నామపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి దువా, బాబునగర్‌లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.

ర్యాలీలో వృద్ధుల ఉత్సాహం


వరదరాజులస్వామి ఆశీసుల్లతో..

పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి పాదాల వద్ద నామపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి దువా, బాబునగర్‌లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని