logo

సర్వజన ఆసుపత్రిలో ఎన్‌ఎంసీ బృందం తనిఖీలు

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలను బోధనాసుపత్రిగా మార్చడం, దానికి అనుబంధంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాటికి అనుమతులు ఇచ్చేందుకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) బృందం శుక్రవారం ఆసుపత్రిని సందర్శించింది.

Published : 04 Feb 2023 05:25 IST

విభాగాల పరిశీలనలో జాతీయ వైద్యమండలి బృందం

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలను బోధనాసుపత్రిగా మార్చడం, దానికి అనుబంధంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాటికి అనుమతులు ఇచ్చేందుకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) బృందం శుక్రవారం ఆసుపత్రిని సందర్శించింది. ఎన్‌ఎంసీ బృంద వైద్యులైన డాక్టర్‌ జయశ్రీ పేతుని, డాక్టర్‌ శ్రీనివాసులునాయుడు ఆధ్వర్యంలో ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.వెంకటేశ్వరరావు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజినీర్ల బృందం... ఎన్‌ఎంసీ అధికారులకు ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణ పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంసీ బృందం  రేడియాలజీ విభాగంలో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ గదిని తనిఖీ చేసి సీటీ స్కానింగ్‌ అందుబాటులో లేదని వైద్యులు చెప్పడంతో వివరాలు నమోదు చేసుకున్నారు. వార్డులోని ఆర్థో, ఎఫ్‌ఎం, ఎంఎం వార్డులో రోగులు, కేస్‌షీట్‌లు, వైద్యులు, సిబ్బంది వివరాలను నమోదు చేసుకున్నారు.  ఎస్‌ఎన్‌సీయూ, ల్యాబ్‌లు, మాతాశిశు విభాగంలోని లేబర్‌ రూం, ఓపీ విభాగాలను తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హేమంతి, సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ ఆనంద్‌, సీఏఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ నజీరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని