logo

భూరీసర్వేలో నాణ్యతాప్రమాణాలు

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కులో భాగంగా నిర్వహిస్తున్న జగనన్న భూరీసర్వేలో పూర్తిస్థాయి నాణ్యతాప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు.

Published : 24 Mar 2023 04:36 IST

సమీక్షలో పాల్గొన్న డీఆర్వో

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కులో భాగంగా నిర్వహిస్తున్న జగనన్న భూరీసర్వేలో పూర్తిస్థాయి నాణ్యతాప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వివిధ మండలాల అధికారులతో దూరదృశ్య సమావేశంలో సరిహద్దు రాళ్లు, చెక్‌ పాయింట్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న సర్వే పురోగతిని అధికారుల నుంచి తెలుసుకున్నారు. సర్వే అత్యంత క్లిష్టతర ప్రక్రియని, భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా భూరీసర్వే ఉపయోగపడుతుందన్నారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ జి.సాయిప్రసాద్‌ కలెక్టర్లతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. డీఆర్వో సత్తిబాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని