logo

లక్ష్యం కనుమరుగు

సీతానగరం మండలం వంగలపూడిలోని కల్లూరి రామకృష్ణ పరమహంస జడ్పీ ఉన్నత పాఠశాలలో బాలికలు, ఉపాధ్యాయినులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Published : 27 Mar 2023 05:16 IST

సీతానగరం మండలం వంగలపూడిలోని కల్లూరి రామకృష్ణ పరమహంస జడ్పీ ఉన్నత పాఠశాలలో బాలికలు, ఉపాధ్యాయినులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో 242 మంది విద్యార్థులతో పాటు 11 మంది ఉపాధ్యాయులు ఉండగా వీరిలో 145 మంది బాలికలు, ఎనిమిది మంది ఉపాధ్యాయినులు ఉన్నారు. వీరి కోసం నిర్మించిన నాలుగు మరుగుదొడ్లలో మూడు మూలకు చేరడంతో ఒక్కటే ఉపయోగంలో ఉంది. బాలికలు, ఉపాధ్యాయినుల కోసం పాఠశాల ఆవరణలో ఓ చోట నాలుగువైపులా బరకాలు అడ్డుగా కట్టి ఆ స్థలాన్ని అవసరానికి వాడుతున్నారు. బాలురతో పాటు ఉపాధ్యాయులు రోడ్లను ఆశ్రయిస్తున్నారు. నాడు-నేడు కార్యక్రమంలో అభివృద్ధి పనులకు రూ.1.35 కోట్లు కేటాయించి రెండు విడతలుగా రూ.48 లక్షలు మంజూరు చేయడంతో ఆ నిధులతో చేపట్టిన పనులు అసంపూర్ణంగా మిగిలాయి. హెచ్‌ఎం ముత్యాలును వివరణ కోరగా బాలికల కోసం మరుగుదొడ్ల నిర్మాణం ముందుగా పూర్తిచేసేలా పనులు చేయిస్తున్నామని చెప్పారు.

న్యూస్‌టుడే, సీతానగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని