logo

సిమెంటు కర్మాగారం ఎదుట రైతుల బైఠాయింపు

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు రైతులు గురువారం చెట్టినాడ్‌ సిమెంటు కర్మాగారం ఎదుట రోడ్డుపై భైఠాయించి వంటావార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. బాధిత రైతుల వివరాల మేరకు.. సిమెంటు కర్మాగారం నుంచి వెలువడే దుమ్ము, ధూళి సమీపంలోని పొలాల్లో పడి

Published : 21 Jan 2022 05:47 IST


టెంటు కింద కూర్చొని అన్నదాతల నిరసన

దాచేపల్లి, న్యూస్‌టుడే : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు రైతులు గురువారం చెట్టినాడ్‌ సిమెంటు కర్మాగారం ఎదుట రోడ్డుపై భైఠాయించి వంటావార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. బాధిత రైతుల వివరాల మేరకు.. సిమెంటు కర్మాగారం నుంచి వెలువడే దుమ్ము, ధూళి సమీపంలోని పొలాల్లో పడి అందులోని పత్తి, మిర్చి, కంది పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడులు తగ్గి వాటికి పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి నెలకొంది. గత నెలలో పోలీసులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సమస్యను సంబంధిత కర్మాగారం ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్ణీత గడువులోగా నష్టపరిహారం చెల్లిస్తామని కర్మాగారం ప్రతినిధులు తెలిపారు. గడువు ముగిసినా స్పందన లేక బాధిత రైతులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. కర్మాగారం ఎదుట రోడ్డుపైనే టెంట్లు వేసుకొని వంటావార్పు చేశారు. అందరూ కలిసి అక్కడే భోజనాలు చేశారు. నిరసన కార్యక్రమాన్ని కూడా పోలీసులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ద్వారా కూడా సిమెంట్‌ కర్మాగారం ప్రతినిధుల నుంచి సమాధానం రాలేదు. దీంతో సమస్య పరిష్కారం అయ్యేవరకు బైఠాయింపు కార్యక్రమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని