logo

ఎమ్మెల్యేకూ తప్పని ఫీట్లు

మండలంలోని కాశిపాడు కాలనీలో నిర్వహించిన ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరరావు ఫీట్లు చేయాల్సి వచ్చింది. వర్షం వస్తే రోడుల బురదనీటితో నిండిపోతున్నాయని. వాటిపై ప్రయాణిస్తే ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

Published : 07 Aug 2022 05:53 IST

కాశిపాడు కాలనీ ‘గడప గడప’లో పాట్లు

కాశిపాడు (పెదకూరపాడు), న్యూస్‌టుడే: మండలంలోని కాశిపాడు కాలనీలో నిర్వహించిన ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరరావు ఫీట్లు చేయాల్సి వచ్చింది. వర్షం వస్తే రోడుల బురదనీటితో నిండిపోతున్నాయని. వాటిపై ప్రయాణిస్తే ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గ్రామంలో ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకపోవడంపైనా ప్రశ్నించారు. మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేక రోగాల బారిన పడుతున్నామంటూ సమస్యలు ఏకరవు పెట్టారు. ప్రాధాన్య క్రమంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని అంతర్గత రహదారులు, మురుగు పారుదల వ్యవస్థ మెరుకుదలకు ప్రణాళికలు సిద్ధం చేసి త్వరితగతిన పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కాలనీ వాసులకు సర్దిచెప్పారు. ఎంపీపీ మీరయ్య, నాయకులు సాంబిరెడ్డి, ఎంపీటీసీ ముప్పెర సాంబశివరావు, గ్రామ వైకాపా నాయకులు మల్లెల కోటేశ్వరరావు, సుధాకర్‌, మధు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని