logo

‘కనీస కూలి రూ. 230 ఎలా సరిపోతాయి..?’

వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్‌ చేశారు.

Published : 30 Nov 2022 04:40 IST

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న అప్పారావు, రామారావు, బాలరాజు, కోటేశ్వరి తదితరులు

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే : వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్‌ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని కార్యాలయంలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు అధ్యక్షత వహించారు. ఈమని అప్పారావు మాట్లాడుతూ నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని, వ్యవసాయ కార్మికులకు ఇచ్చే కనీస కూలి రూ.230లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక శాఖ అధికారుల ద్వారా కనీస వేతనాలపై అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్‌ 8, 9, 10 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్‌ 5, 6 తేదీల్లో సంఘం జెండా ఆవిష్కరణలు చేయాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో నాలుగు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మహాసభల గోడపత్రికలను  ఆవిష్కరించారు. సంఘం మహిళా విభాగ జిల్లా కన్వీనర్‌ కోటేశ్వరి, నాయకులు అజయ్‌, కాలమరాజు, దుర్గారావు, అరుణ, వెంకటరమణ, బైరగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని