logo

ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్‌

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు.

Published : 28 Mar 2024 06:29 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ శివశంకర్‌, పక్కన డీఆర్వో వినాయకం
నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం విలేకర్ల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రవర్తన నియామవళి ఉల్లఘించి రాజకీయపార్టీల కార్యకలాపాల్లో పాల్గొన్న 9 మంది వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులు ఇద్దరు, ఐదుగురు పొరుగుసేవల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు 12 మందిపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే కోడ్‌ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు 3713 పోస్టర్లు, 3310 బ్యానర్లు తొలగించామన్నారు. రాజకీయపార్టీలకు సంబంధించి 5071 గోడరాతలు, 12094 బ్యానర్లు తొలగించినట్లు చెప్పారు. కోడ్‌ ఉల్లంఘనలపై సీ విజిల్‌ యాప్‌లో 398 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాజకీయపార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు కమిషన్‌ నిబంధనల గురించి తెలియజేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు ఏప్రిల్‌ 10లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, మార్చి 31 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫాం-6 ఇవ్వవచ్చని వెల్లడించారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓటు మార్చుకునేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.1.12 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.50 వేలు దాటి తీసుకెళ్లే వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇతరులు ఎవరైనా ఆధారాలు తనిఖీ అధికారులకు చూపాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని