logo

కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు

బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్లో పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 05:38 IST

రఘుపతి పేరుతో రూ.10.63 కోట్ల ఆస్తులు
సతీమణి రమాదేవికి రూ.13.56 కోట్ల ఆస్తులు
ఎలాంటి నేరచరిత్ర లేదని పేర్కొన్న ఎమ్మెల్యే

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రఘుపతి పేరిట రూ.3,53,93,486 విలువైన చరాస్తులు, రూ.7.10 కోట్ల విలువైన స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.10,63,93,486 విలువైన ఆస్తులు ఉన్నాయి. సతీమణి రమాదేవికి రూ.1,16,12,657 విలువైన చరాస్తులు, రూ.12.40 కోట్ల విలువైన స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.13,56,12,657 విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు.  ఎమ్మెల్యే కన్నా ఆయన సతీమణికే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించటం గమనార్హం. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని, ఏ కేసులోనూ శిక్ష పడలేదని ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. తన పేరిట ఓ ఆయిల్‌ ట్యాంకర్‌, రెండు కార్లు, సతీమణి రమాదేవి పేరుతో ఓ కారు ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ భూములు లేవని పేర్కొన్నారు. ఇద్దరికీ కలిపి బ్యాంకుల్లో రూ.1.41 కోట్ల రుణాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని