logo

షాపూర్‌నగర్‌ డాక్టర్‌ ఎంపీ అయ్యారు

వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకున్న ఘనత కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలది.

Published : 29 Oct 2023 04:18 IST

వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకున్న ఘనత కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా హన్మకొండ వేలేరు గ్రామానికి చెందిన డాక్టర్‌  విజయరామారావు 1979లో షాపూర్‌నగర్‌కు వచ్చారు. షాపూర్‌ క్లినిక్‌ పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేసి రాణించారు. అదే సమయంలో తెదేపాలో పనిచేసి 1984లో సిద్దిపేట పార్లమెంటు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి తెదేపా అభ్యర్థిగా గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి తెరాస అభ్యర్థిగా గెలిచారు. వైఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు.

న్యూస్‌టుడే, కుత్బుల్లాపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని