Published : 06 Dec 2021 03:18 IST
‘స్వచ్ఛంద’ సేవలు ప్రశంసనీయం
మాట్లాడుతున్న డీఆర్‌వో మాలోల
కడప ఎన్‌జీవో కాలనీ న్యూస్‌టుడే : విపత్తులు వచ్చినప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు అందించే సేవలు ప్రశంసనీయమని డీఆర్వో మాలోల అన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కడప నగరంలోని యూత్ హాస్టల్‌లో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలో విస్తృత సేవలు చేసిన ఎన్‌జీవోలను సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్వో మాట్లాడుతూ.. ఎన్‌జీవోలు మరిన్ని సేవలు చేసి జిల్లా ఖ్యాతిని చాటాలన్నారు. స్టెప్ సీఈవో రామచంద్రారెడ్డి, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags :