logo

పీఎండీఎస్‌ పంటల పరిశీలన

మండల పరిధిలో సాగులో ఉన్న పీఎండీఎస్‌ పంటలను ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం నాగరాజు శుక్రవారం పరిశీలించారు. దిన్నెమీదపల్లె, బాపూజీనగర్‌కాలనీ, గంగిరెడ్డిగారిపల్లె, కొత్తపేట గ్రామాల్లోని పంటలను పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. ఈ పంటల సాగుతో ఏడాది పొడవునా భూమిపై పచ్చదనం ఉంటుందని, ఆ దిశగా

Published : 15 Jan 2022 02:25 IST


కొత్తపల్లె వద్ద రైతులకు సూచనలిస్తున్న డీపీఎం నాగరాజు

చిన్నమండెం : మండల పరిధిలో సాగులో ఉన్న పీఎండీఎస్‌ పంటలను ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం నాగరాజు శుక్రవారం పరిశీలించారు. దిన్నెమీదపల్లె, బాపూజీనగర్‌కాలనీ, గంగిరెడ్డిగారిపల్లె, కొత్తపేట గ్రామాల్లోని పంటలను పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. ఈ పంటల సాగుతో ఏడాది పొడవునా భూమిపై పచ్చదనం ఉంటుందని, ఆ దిశగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వేసవిలోనూ పంటలను కాపాడుకొనేందుకు ద్రవ జీవామృతం పిచికారీ చేయాలన్నారు. చిన్నమండెం ఆదర్శ పాఠశాలలో సాగు చేసిన సూర్య మండలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్డీఏలు నారాయణ, యశోదమ్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు