logo

విద్యుత్తు మోటార్ల దొంగలపై పీడీ చట్టం అమలు

వ్యవసాయ విద్యుత్తు మోటార్లను అపహరిస్తూ పట్టుబడిన ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగలపై కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పోలీసులు నిర్బంధ ఉత్తర్వులు(పీడీ చట్టం)

Published : 19 Jan 2022 02:22 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: వ్యవసాయ విద్యుత్తు మోటార్లను అపహరిస్తూ పట్టుబడిన ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగలపై కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పోలీసులు నిర్బంధ ఉత్తర్వులు(పీడీ చట్టం) అమలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నారాయణపూర్‌ మండలం వాయిళ్లపల్లికి చెందిన ఒర్సు మహేష్‌(30), ఒర్సు భరత్‌(19), మర్రిగూడ మండలం, ఎరగండ్లపల్లికి చెందిన వరికొప్పుల నర్సిసింహ(33)లు హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌ నగర్‌లో కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. డబ్బులు కుటుంబపోషణకు సరిపోకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని ముఠాగా ఏర్పడ్డారు. కూలి పని పేరు మీద ఆటోలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ వ్యవసాయ బావిలో ఉన్న విద్యుత్తు మోటార్లను అపహరిస్తూ ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. వరంగల్‌ కమిషనరేట్లో పరిధిలో రూ.4లక్షల విలువగల 38 విద్యుత్తు మోటార్లను అపహరించుకుపోయారు. కరీంనగర్‌ కమిషనరేట్ పనిధిలోని ఇల్లందకుంట రామాలయం సమీపంలో విద్యుత్తు మోటర్లను తరలిస్తున్న సమయంలో హుజూరాబాద్‌ పోలీసులు డిసెంబర్‌ 12న పట్టుకున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్‌ సబ్‌-జైలులో ఉన్న నిందితులకు జైలర్‌ సమక్షంలో ఇన్‌స్పెక్టర్‌  శ్రీనివాస్‌ నిర్బంధ ఉత్తర్వులను అమలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని