logo

నగరంలో వన్‌వే ట్రాఫిక్‌!

కరీంనగర్‌ నగరంలో వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమలు చేయాలని కమిషనరేట్‌ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్, వరంగల్‌ మహానగరాల్లో ఇప్పటికే

Published : 20 May 2022 04:19 IST

ప్రయోగాత్మకంగా ఐదు ప్రాంతాలు ఎంపిక

న్యూస్‌టుడే, కరీంనగర్‌ నేరవార్తలు: కరీంనగర్‌ నగరంలో వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమలు చేయాలని కమిషనరేట్‌ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్, వరంగల్‌ మహానగరాల్లో ఇప్పటికే అమలవుతున్న వన్‌వేను కరీంనగర్‌లో సైతం అమలు చేయాలని యోచిస్తున్నారు. ద్దీ సమయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ సూచనల మేరకు నగరంలోని ఐదు ప్రాంతాలపై అధ్యయనం చేశారు. గతంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అవసరం లేకుండానే రద్దీని అదుపు చేశారు. ప్రస్తుతం నగరం 45 చదరపు కిలో మీటర్లు విస్తరించడమే కాకుండా వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నగరంతో పాటు సమీప గ్రామాల ప్రజలు రోజు వారీగా నిత్యావసరాలకు ఇక్కడికి వస్తుండటంతో రోజురోజుకు రద్దీ పెరిగి నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.

రద్దీ ఇక్కడే..

నగరంలోని మార్కెట్ ఏరియా, టవర్‌ సర్కిల్, రాజీవ్‌చౌక్, డాక్టర్స్‌ వీధి, తెలంగాణ చౌక్‌ ప్రాంతాలను అతి రద్దీ ప్రాంతాలుగా గుర్తించారు. బస్టాండ్, సినిమా హాళ్లు, షాపింగ్‌్ మాల్స్, కూరగాయల వ్యాపారాలు, ఆసుపత్రులు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. ఎక్కడా సరైన పార్కింగ్‌ సదుపాయం లేకపోవడంతో రోడ్లపైనే అనేక మంది వాహనాలు నిలుపుతుండటంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. రద్దీని అదుపు చేయడానికి వన్‌వే ఏకైక మార్గంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని ప్రాంతాలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాహనచోదకుల స్పందన ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ట్రాఫిక్‌ పోలీసులు పరిగణలోకి తీసుకోనున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారి ఫొటోలు తీయడం తమకు ముఖ్యం కాదంటున్న పోలీసులు... రద్దీని అదుపు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోలీసులు వన్‌వేకు ప్రతిపాదిస్తున్న సందర్భంలో దానికి అనుగుణంగా నగరపాలక సంస్థ సైతం పార్కింగ్‌కు స్థలాలు కేటాయిస్తే రద్దీ సమస్యను సునాయాసంగా అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని