logo

జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం

జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లతో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 05:43 IST

రాంపూర్‌(కరీంనగర్‌), గన్నేరువరం, న్యూస్‌టుడే: జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లతో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో మార్నింగ్‌ వాక్‌ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. తన కృషి మేరకే హైదరాబాద్‌-కరీంనగర్‌ రైలు మార్గం సుగమమైందని, పనులు కూడా సిద్దిపేట వరకు పూర్తయ్యాయని, ఈ ఏడాది డిసెంబరు వరకు సిరిసిల్ల-కరీంనగర్‌ వరకు రైల్వేలైను పనులు పూర్తి కానున్నాయని చెప్పారు.  నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ఆనాడు తాను ఎంపీగా కృషి చేయగా, ప్రస్తుత ఎంపీ సంజయ్‌ వాటిని పట్టించుకోలేదని తెలిపారు.  గ్రామాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, కార్పొరేటర్‌ తోట రాములు పాల్గొన్నారు. మధ్యాహ్నం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో  కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాల భారాస ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. భారాస జిల్లా, నగర అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావు, చల్ల హరిశంకర్‌, ఎంపీపీలు లక్ష్మయ్య, శ్రీలత పాల్గొన్నారు. సాయంత్రం గన్నేరువరంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో వినోద్‌కుమార్‌ ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని