logo

బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం

ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు.

Updated : 27 Apr 2024 07:03 IST

ఈనాడు, పెద్దపల్లి: ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. కార్మికుల ఆదరణ చూరగొనేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వారి సంక్షేమానికి అమలు చేసే హామీలు వివరిస్తూనే, తనను గెలిపిస్తే ఏం చేస్తామో ప్రత్యేక వరాలు ప్రకటిస్తున్నారు. కార్మికులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే ఒత్తిళ్లు.. వేతన పెంపు.. ఆదాయపు పన్ను.. పని ప్రదేశాల్లో భద్రత, రక్షణ తదితర అంశాలన్నింటినీ కూలంకషంగా అడిగి తెలుసుకుంటున్నారు. మంథని, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో విస్తరించిన సింగరేణి ఉపరితల, భూగర్భ గనుల వద్దకు వెళ్తూ అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు గేట్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. కార్మికులను ఆప్యాయంగా పలకరిస్తూ సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. బాయిబాట, కార్మికులతో ములాఖత్‌ వంటి పేర్లతో ప్రచారం ముమ్మరం చేశాయి. నియోజకవర్గంలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు 3 లక్షలకు పైగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు సాధ్యమనే భావనతో ప్రధాన పార్టీలు బొగ్గు గనులపై దృష్టి సారించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని