logo

నారీమణులే నిర్ణేతలు

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది.

Updated : 27 Apr 2024 07:01 IST

పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో మహిళా ఓటర్లే అధికం
రామగుండం మినహా అన్ని చోట్లా వారిదే ఆధిపత్యం
న్యూస్‌టుడే, గోదావరిఖని

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉండటంతో వారే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 15,92,996 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 8,05,755 మంది, పురుషులు 7,87,140 మంది, ఇతరులు 101 మంది ఉన్నారు. పురుషుల కంటే 18,615 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఏడు సెగ్మెంట్లలో ఒక్క రామగుండంలో మాత్రమే 285 మంది పురుషులు ఎక్కువగా ఉన్నారు. ఓటేసే వారిలోనూ అతివలే అధికంగా ఉండనున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే అభ్యర్థులకే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.

ఆదరణ దక్కేలా వ్యూహాలు

అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్ల ఆదరణ తమకే దక్కేలా అభ్యర్థులు ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన నియోజకవర్గంలో చైతన్యం ఎక్కువగా ఉండటంతో మహిళలు కూడా అదే భావాలతో ఉంటారు. కార్మిక ఉద్యమాలతో పాటు మహిళా హక్కుల సాధనలో ఈ ప్రాంతంలో ఎక్కువగా స్పందించిన సందర్భాలున్నాయి. ఇందులో భాగంగా మహిళా సమస్యలతో పాటు ఇతర అంశాలను ప్రస్తావించి వారి నుంచి ఓట్లు రాబట్టుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను అభ్యర్థులు పరిశీలిస్తున్నారు.]

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు