logo

పశుపక్షాదుల దాహం తీర్చేలా..

వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్‌ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Published : 27 Apr 2024 05:27 IST

కోరుట్ల, న్యూస్‌టుడే: వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్‌ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘వేస్టు టూ వండర్‌’ ద్వారా వినియోగించిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, నూనె డబ్బాలతో నీటి పరికరాలు తయారు చేయించారు. పట్టణంలో సుమారు 4 కిలోమీటర్ల పొడవు గల రహదారిపైనున్న డివైడర్లలోని చెట్ల మధ్యలో చిన్నచిన్న నీటి తొట్టిలు, మట్టిపాత్రలు, సగం వరకు కత్తిరించిన ప్లాస్టిక్‌ బాటిళ్లను ఏర్పాటు చేయించారు.

అల్లమయ్యగుట్ట వద్దనున్న నర్సరీలో మొక్కలకు, చెట్ల కింద ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉంచారు. వీటితోపాటు అయిలాపూర్‌, మెట్‌పల్లిరోడ్‌, జగిత్యాల ప్రధాన రహదారుల, ఇతర ప్రదేశాల్లో సిమెంట్‌ కుండీలను ఏర్పాటు చేయించారు. నిత్యం ఈతొట్టిలు, మట్టిపాత్రల్లో, ప్లాస్టిక్‌ బాటిళ్లలో మున్సిపల్‌ సిబ్బందితో నీటిని పట్టిస్తున్నారు. దీంతో పక్షులు, పశువులు నీటిని తాగుతూ చెట్లపైన, కింద సేదదీరుతున్నాయి. డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేయించిన నీటి పాత్రల వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయండంతో పట్టణ ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. కమిషన్‌ తిరుపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇళ్లల్లో, నివాస ప్రాంతాల్లో పశువులు, పక్షుల దాహం తీర్చేందుకు నీటి పాత్రలను ఏర్పాటు చేయించి ప్రకృతిని పరిరక్షించేందుకు తమవంతు కృషి చేయాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని